Tuesday, 14 May 2019

Maharshi Maheh babu 25 th Movie sensational Trailer.

ఈ నెల 9న విడుదలైన సినిమా
అన్ని ప్రాంతాల్లోను భారీ వసూళ్లు
రెండవ వారంలో కొత్త సీన్స్ జోడింపు
మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన 'మహర్షి' సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి థియేటర్స్ లో సందడి చేస్తోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మరి కొన్ని సీన్స్ ను జోడించే ఆలోచనలో టీమ్ వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో మహేశ్ బాబుకి నచ్చిన సీన్స్ కొన్ని వున్నాయట. అయితే నిడివి ఎక్కువగా ఉందని ఆ సీన్స్ ను ట్రిమ్ చేశారట. ఇప్పుడు ఆ సీన్స్ ను పూర్తిగా వుంచుతారని తెలుస్తోంది. అంతేకాదు, కామెడీకి సంబంధించిన ఒకటి .. రెండు సీన్స్ కూడా జోడించనున్నారు. ఈ కారణంగా 10 నిమిషాల నిడివి పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. రెండవ వారంలో కొత్త సీన్స్ జోడింపు ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ ప్రయత్నం ఎలాంటి టాక్ తెస్తుందో చూడాలి.                     

Maharshi: వాళ్లే కాదు.. నేనూ కాలర్ ఎగరేస్తున్నా: మహేష్ మాస్ స్పీచ్

మూడు పెద్ద బ్యానర్‌లు మా సినిమాను ప్రొడ్యూసర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా రిలీజ్ అయినప్పుడు అశ్వనీదత్ గారు సినిమా చూశారు. ఆయన ఎప్పుడూ నన్ను ప్రిన్స్, బాబూ అని పిలుస్తారు. విపరీతంగా నచ్చినప్పుడు మాత్రమే మహేష్ అని పిలుస్తారు.

హైలైట్స్
వైభవంగా మహర్షి సక్సెస్ మీట్
ఆకట్టుకునే ప్రసంగం చేసిన మహేష్ బాబు

తన శైలికి విరుద్ధంగా మాస్ స్పీచ్ ఇచ్చిన మహేష్ బాబు
'మహర్షి' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు తొలిసారి ఆయన శైలికి విరుద్ధంగా మహేష్ ఫ్యాన్స్‌లో ఉత్తేజం నింపే ప్రసంగం చేశారు. కాలర్ ఎగరేస్తూ.. నా ఫ్యాన్స్‌తో నేను ఈరోజు కాలర్ ఎగరేస్తున్నా అంటూ ఉత్సాహభరితమైన ఊర మాస్ స్పీచ్ ఇచ్చారు. 'మహర్షి' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హైదరాబాద్‌లో ఆదివారం నాడు ఎపిక్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ బాబు.. 'ఈ రోజు చాలా స్పెషల్ డే. మదర్స్ డే. నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడు సినిమా రిలీజ్ ముందు ఆవిడ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నంత హ్యాపీ నాకు. ఆమె ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం. అందుకు ఈ 'మహర్షి' చిత్రం ఎపిక్ బ్లాక్ బస్టర్‌ని మా అమ్మతో పాటు అందరి తల్లులకు అంకితం ఇస్తున్నా.
ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలి. నా ముందు మాట్లాడిన వంశీ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. నన్ను నేను కూల్ చేసుకుంటున్నా. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ గురించి ఏం చెప్పాలో అన్నీ చెప్పేశా. నిజంగా నువ్ రాక్ స్టార్ బ్రదర్. నేను దేవి లేకుండా సినిమాలకు పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే నాకు దేవి అంటే ప్రాణం. ఈ సినిమాలో పదరా.. పదరా సాంగ్‌కాని.. ఇదే కదా సాంగ్ కాని నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేయలేరు. ఆ పాటలు కథతో పాటు జర్నీ చేస్తుంటాయి. నేను ఈ సినిమాతో మూడేళ్లు జర్నీ చేశా. మొదట దిల్ రాజు కథ విని క్లాసిక్ విన్నారు. తరువాత దత్ గారు విని గేమ్ ఛేంజ్ కాబోతుంది అన్నారు.
నేను క్రికెట్‌కి పెద్ద ఫ్యాన్‌ని ఇండియా-శ్రీలంక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాజ్ ముంబాయిలో చూశా. లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాడు ధోని. అప్పుడు నేను విపరీతంగా చప్పట్లు కొట్టాను. సేమ్ రాజు గారు కథ విని సిక్సర్ అన్నారు. నాకు అదే ఆనందం వచ్చింది.

No comments:

Post a Comment